![]() |
Island |
ప్రపంచంలో పెద్ద ద్వీపం ఏమిటో తెలుసా?
ప్రపంచ పటంలో నేల భాగాన్ని ప్రాథమికంగా ఖండాలు (continents)గా విభజించారు. అవి : ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇందులో ప్రజలు నివసించని అంటార్కిటికాను ఖండాల్లో లెక్కించరు. అలాగే రెండు అమెరికాలను ఒకే ఖండంగా పేర్కొంటారు. ఇలా చూసినప్పుడు మొత్తం ఖండాలు ఐదు. ఖండాలుగా ఉన్న ప్రాంతాల చుట్టూ సముద్రాలు లేదా సముద్రపు నీటి ప్రాంతాలున్నా వాటిని ద్వీపాలు (islands)గా పరిగణించరు. ఖండాల్లో అంతర్భాగంగా ఉన్న దేశాలేమైనా ఉండి, వాటి చుట్టూ అన్ని వైపులా సముద్రపు జలాలుంటే వాటినే ద్వీపాలుగా భావిస్తారు.
ఆస్ట్రేలియా దేశమే అయినా అది ఓ ప్రధాన ఇండం. ఓ ఖండంగా చూస్తే దీని వైశాల్యం దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్లు. అందులో ఓ దేశంగా ఉన్న ఆస్ట్రేలియా వైశాల్యం సుమారు 77 లక్షల చదరపు కిలోమీటర్లు. గ్రీన్లాండ్ ఉత్తర అమెరికా ఖండంలో ఓ భాగం. మొత్తం ఉత్తర అమెరికా ఖండపు వైశాల్యం 245 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, గ్రీన్లాండ్ ద్వీపపు మొత్తం వైశాల్యం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా దేశపు భాగం దాదాపు 85 శాతం కాగా, ఉత్తర అమెరికా ఖండంలోని గ్రీన్లాండ్ భూభాగం 10 శాతం. కాబట్టి గ్రీన్లాండను ఓ ద్వీపంగా, ఆస్ట్రేలియాను ఓ ఖండంగా మాత్రమే పరిగణిస్తారు. కాబట్టి గ్రీన్లాండ్ నే అతి పెద్ద ద్వీపంగా లెక్కిస్తారు.
ప్రపంచంలో పెద్ద ద్వీపం ఏమిటో తెలుసా? || Do you know what the biggest island in the world? || prudhviinfo