డాగ్ లా ప్రవర్తించకండి గాడ్ లాగమరండి
ఈ చిన్ల కథ చూద్దాం. ఒక కుక్క ఒక రోజు ఒక అద్దాల గదిలోకి వెళ్లడం జరిగింది.అదిఎదురుగా ఎన్నో కుక్కలు వస్తున్నట్పగా భ్రమ పడి ప్రక్కకు తిరిగింది.అటు వైపు నుండి కూడా ఎన్నోకుక్కలు తన వైపుకు వస్తున్నట్టు చూసి భయపడి వేరొక దిక్కుకు తిరిగిన.అటు నుండి కూడా ఎన్నో కుక్కలు రావడము చూచి వేరొక దిక్కుకు పరిగెత్తింది. ఇతర కుక్కలు చూస్తే అసూయపడే సహజగుణము కారణంగా ఆ గదిలో అన్ని వేరే కుక్కలను భావించి అటూ ఇటూ పరిగెత్తుతూ మొరుగుతూ,ఆయా స పడి చివరకు మరణించింది.
అదే గదిలోకి ఆ గది యజమాని ప్రవేశిస్తే అన్నీ తానే అనితెలుసు కాబట్టి తన ప్రతిబింబాలు
చూచి అహహ అనినవ్వుకుంటాడు. అలాగే మానవుడుఈ మాయా అద్దాల ప్రపంచములో ప్రవేశo చి ఇక్కడ ఉన్నవారు వేరు వేరు లని భావించి ఈర్ష్య అసుయతో అందరునీ ద్వేషిస్తూ కలహిస్తూ అన్నిటికీ భయపడుతూచివరికి అశాంతితోమరణిస్తున్నాడు.అద్దాల గదిలో ప్రవేశించిన కుక్క (డాగ్) లాగే అతనిపరిస్థితి తయారయ్యింది కుక్క ప్రతిబింబాన్ని ని చూచి నిజమనుకుని, అవి అనీతాను అని కాదు వేరేకుక్కలని, భ్రమించి తన సహజ సిద్ధమైన ద్వేషం గుణం వల్ల భయంతో అటు ఇటు పరిగెడుతూ ఎలా మరణించిందో, మానవుడు కూడా అజ్ఞానంతో ఈ ప్రపంచంలో అందరు వేరు ,వేరు అని భావించడం వల్లఎవరని ప్రేమించలేక, స్వార్ధతో ఇతరులను ద్వేషిస్తూ, మోసగిస్తూ,దోచుకుంటూ, బాధిస్తూ , కలహించుకుంటూ భయంతో అశాంతితో జీవిస్తూ ఎన్నో పాపాలు చేస్తూ చివరకు దుఃఖంతో మరణిస్తున్నాడు. కానీ ఏ మానవుడైతే జ్ఞానవంతులై అహం బ్రహ్మాస్మి, అనే సత్యాన్ని తెలుసుకోవడమే కాకుండా "తత్వమసి" అంటే అందరిలో ఉన్నది తానే, అన్ని తన ప్రతిబింబాలే అని తెలుసుకుంటాడో స్వార్థరహితంగా జీవిస్తూ అందరినీ ప్రేమిస్తూ జీవిస్తూ, సకల ప్రాణికోటితో, మిత్రత్వం వహిస్తుంటాడో ఉంటాడో వాడు చివరకు భగవంతుడు (G O D) అవుతున్నాడు. అందుచేత గ్రహించండి అద్దాల గదిలోప్రవేశించినDogప్రవర్తించకండి. అద్దాల గదిలో ప్రవేశించిన D OG లా యజమానిల ప్రవర్తించండి.
G O D లా మారండి కనబడే వన్నీ వేరే అని భావించి డాగ్ స్థితి నుండి అందరు ఒకటే అని తెలుసుకొనే
G O D స్థితికి మారండి. మనం ఎప్పుడు జీవించడానికి సిద్ధ పడుతున్నామో తప్ప నిజంగా జీవించడం లేదు ఎవరికో ఒకరికి ఉపయోగపడేలాగా మన జీవితాన్ని మలచుకొని జీవించాలి అదే ఉన్నతమైన మానవ జీవితం.
మానవ జన్మ లో పుట్టినందుకు
ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేసి, తమ జీవితాన్ని సార్ధకం చేసుకోండి.