![]() |
Abhinaya Siddhi |
అభినయ సిద్ధి
జగన్నాటకంలో అందరూ పాత్రధారులే.
రంగ స్థలం మీద జరుగుతున్న విధంగానే, ప్రపంచ రంగ స్థలం మీద కూడా జరుగుతుంది. ఒక్కటి తేడా. రంగస్థల నటులకు తాము నటులమని, తమ అభినయం పరిమిత సమయం వరకేసని బాగా తెలుసు. ప్రపంచ రంగస్థల నటులమైన మనకు కొంచెమైనా ఈ స్పృహ లేదు. అందువల్లనే మన పాత్రలు శాశ్వతమనే భ్రాంతిలో విర్ర వీగుతూ ఉంటాము. ఎన్నో అకృత్యాలు చేస్తుంటాము. రంగస్థల నటులు తమ అభినయం పూర్తి కాగానే వేషధారణ. అలంకారాలు, ఆహార్యం తొలగించి, తమ అసలు రూపాల్లోకి వచ్చేస్తారు. కాని, మన అభినయానికి, శరీర రూప లావణ్యాలకు అంతిమ చరణం మృత్యువే! శరీరం నుంచి వేరుపడిన ఆత్మే మన అసలు రూపం, శరీరము ఉన్నంత కాలము ఎందరికో ఆత్మ స్పృహే ఉండదు. ఉండదు కనుకనే అభినయానందమే
కేవలంమనమనే భావనతో జీవిస్తూ ఉంటారు. ఈ భావనను పటాపంచలు చేయగలిగిన సుజ్ఞానం కోసం మహాత్ముల అనుగ్రహం కావాలి. ఎవరా మహాత్ములు? వాళ్లు ఆధ్యాత్మిక ఆడంబర వేషధారులు కాదు. ప్రాపంచిక పరిధులకు అతీతులైన అవదూతలు. భక్తుల లోపాలను సరిదిద్ధి, సరైన మార్గంలో పెట్టి, వారికి జన్మ ప్రయోజనాన్ని సిద్ధింప జేసే వారు. భగవాను గీతా బోధనలో "మమ మాయ దురత్యయా' అంటూ మాయ శక్తిని అర్జునుడికి వివరిస్తాడు. ఇంతకీ ఏమిటీ మాయ? ఎలా దీని నుంచి విముక్తులం కాగలం. పంచేద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే అష్ట శక్తులు మనిషికి ఉంటాయంటారు. వీటిని సక్రమంగా వినియోగిస్తే అవే అష్ట సిద్ధులవుతాయని,
వికృతముగా వినియోగిస్తే అవే అష్ట బంధనాలవుతాయన్నది అనుభవం. ఇవి అదృశ్య బంధనాలు. కాని అమిత బలమైనవి. వీటి బంధంలో బందీలుగా పడిఉండడమే మాయ ఈ మాయలో ఉన్నంతకాలం మనిషి అభినయానందం చెందుతుంటాడు. ఇది నా ఇల్లు. వీరు నా వారు. నేను మహా మేధావిని, సర్వ సమర్థుడ్ని ఇలా పలు రకాల అపోహలు ప్రపంచ రంగస్థలం మీద తన పాత్రను అభినయిస్తుంటాడు. తన కండ్ల ముందే కొన్ని పాత్రలు శాశ్వతంగా వీడ్కోలు చెప్పినా జీవన సత్యం అతనికి అవగతం కాదు. స్మశాన వైరాగ్యం - ఆత్మ విచారాన్ని ప్రేరేపించిన, మళ్ళీ మాయ కమ్ముకుంటుంది. ఇది శరీర స్నానం చేస్తూనే ఉన్నా. మళ్ళీ మళ్ళీ మాలిన్యం వంటి కంటడం వంటిది.
మాయ తెరల్ని తొలగించగింది నిర్మల జ్ఞానం. ఆత్మ వైపు దృష్టిని మరల్ని సత్యాన్వేషణకు పూనుకొనాలి. ఈ ప్రయత్నం ఎంత తీవ్రంగా జరిగితే అంత త్వరగా ఆత్మ దర్శనమవుతుంది. అపుడు శరీరం అభినయిస్తుందే తప్ప, ప్రజ్ఞ అనుసరించదు. అదే అభినయ సిద్ధి!
"మానవులు తప్పులు చేయడం తప్పుకాదు,
తను చేసిన తప్పులను సరిదిద్దుకోక పోవడంపెద్ద తప్పు"
అభినయ సిద్ధి || Abhinaya Siddhi || prudhviinfo