
These 6 habits of doing S.A.V.E.R.S. by before 8 o clock in the morning will change your life

ఉదయం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అలవాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.
హాల్ ఎలోర్డ్ అనే ప్రముఖ రచయిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉదయం 8 లోపు చేసే 6 పనులు మన జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బయటపడ్డ ఈ రచయిత ఇప్పుడు తన రచనలతో ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాడు.
ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S
S-Silence
( నిశ్శబ్దం)....మన ప్రతి రోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి…అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి..లేవడం లేటయ్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ పని…ఈ రోజు అతడిని కలుస్తానని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంతలా హైరానా పడొద్దు… ప్రశాంతంగా లేవగానే….కాసింత సేపు మెడిటేషన్ చేయండి. లేదా…కళ్ళు మూసుకొని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది .
A-Affirmations
( నీతో నువ్వు మాట్లాడుకోవడం)…. అందరి గురించి, అన్ని విషయాల గురించి అనర్గలంగా మాట్లాడే మనం…మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు మనలోని మనకు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ప్రతి రోజు మీతో మీరు మాట్లాడుకోండి.
1) నేనేమి కావాలనుకుంటున్నా.??
2)దాని కోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్న??
3) అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలివెయ్యాలి? వేటిని కొత్తగా ఆహ్వానించాలి? ఇలా ప్రతి రోజూ మనలో మనం మాట్లాడుకుంటూ….మనలోని మార్పును మనమే లెక్కించాలన్న మాట.!
V-Visualization
( ఆత్మ సాక్షాత్త్కారం)… మనలోని భావాలకు మనస్సులో దృశ్యరూపం ఇవ్వడం. కాన్సియస్ తో కలలు కనడం అన్నమాట! ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనబడితే…దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం.
E-Exercise
ఇది ప్రతి ఒక్కరికి తెల్సిన విషయమే… కండరాలు, నరాలు ఉత్తేజితమై…కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది.
R-Reading-
రోజుకు 10 పేజీలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలి..ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది. ఫలానా బుక్ చదవాలని లేదు..మీకు తోచిన బుక్ ను చదువుతూ పోండి.
S-Scribing
( రాయడం)- ఉదయం లేవగానే…మీకు తోచిన లైన్స్ రాయండి… వీటిని మార్నింగ్ పేజెస్ అంటారు. ఇలా మీరు రోజూ రాస్తూ పోతే…మీ ఆటిట్యూడ్ లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయ్.
సో….ఈ పనులన్నీ ఉదయం 8 లోపే చేయాలి. ఆల్ ది బెస్ట్…మీలోని మిమ్మల్ని నిద్రలేపండి.
ఉదయం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అలవాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.! || These 6 habits of doing S.A.V.E.R.S. by before 8 o clock in the morning will change your life! || prudhviinfo