-->

పొద్దుతిరుగుడు పువ్వులు సూర్యుడిని అనుసరించడానికి ఎందుకు తిరుగుతాయి || The Mystery Of Why Sunflowers Turn To Follow The Sun || prudhviinfo

 The Mystery Of Why Sunflowers Turn To Follow The Sun


 ఆ పువ్వు ఎందుకు తిరుగుతోంది?


పొద్దు తిరుగుడు పువ్వు ఎప్పుడూ సుర్యుని వైపే తిరిగి ఉంటుంది. ఇలా తిరగడానికి కారణం ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం అనే లక్షణమే కారణం. ఫొటోట్రాపిజం అంటే, సూర్యరశ్మి వల్ల మొక్క పెరుగుదలతో పాటు కలిగే ప్రతిస్పందన పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్' అనే హార్మోన్ ఈ స్పందనను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్ మొక్కలు ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. మొక్కల్లో ఉన్న ఎమినో ఆసిడ్వ ల్లగాని, కార్బొహైడ్రేటులో విచ్ఛిన్నం కావడం వల్ల గాని ఈ హార్మోన్ ఏర్పడుతుంది. ఈ హార్మోన్మొ క్కలో ఉన్న కణాల గోడలపై ఉన్న కార్బొహైడ్రేట్ల బంధాలపై పనిచేస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఈ మొక్క పై సూర్యరశ్మి నేరుగా పడినపుడు

  ఆ మొక్క వెనుక భాగంలో అంటే పువ్వు వెనుక ఉన్న కాండంపై నీడ ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా సోకని ఆ భాగాల్లో 'ఆక్సిన్' హార్మోన్  ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఆభాగం వేగంగా పెరుగుతుంది. అందువల్ల ఆ దిశలో మొక్క దానితోపాటు పువ్వు కదులుతాయి. నీడలో ఉండే కాండం పెరిగే కొద్దీ, ఆ పెరుగుదల మొక్కను నీడనుంచి సూర్యరశ్మి పడే దిశలోకి కదిలిస్తుంది. ఫలితంగా పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుని వైపు తిరిగి ఉంటుంది. అందుకే దీన్ని సూర్యకాంత పుష్పం అంటారు.


పొద్దుతిరుగుడు పువ్వులు సూర్యుడిని అనుసరించడానికి ఎందుకు తిరుగుతాయి || The Mystery Of Why Sunflowers Turn To Follow The Sun || prudhviinfo


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT