
జీవ గడియారం'లో తేడా వద్దు..

భూమి మీద నివసించే ప్రతి జీవి నిద్ర, ఆహారం విషయంలో క్రమబద్ధంగా వ్యవహరిస్తాయి. చీకటి పడగానే నిద్రపోతాయి. తెల్ల వారకముందే నిద్రలేస్తాయి. అవసరం మేరకే ఆహారం తీసుకుందాయి. కొన్ని రాత్రుల్లో మేల్కొని పగలు నిద్రపోతాయి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాలన్నీ వేళాపాళా పాటిస్తాయి. ప్రతి విషయంలో క్రమబద్ధంగా జీవిస్తాయి. దీనికి కారణం ప్రతి జీవి జీవన గడియారం ప్రకారం జీవప్రక్రియల్ని నిర్వహించడమే. ఆదిమానవుడు కూడా జీవన గడియారం నిర్దేశం ప్రకారం నిద్రాహారాలు నిర్వహించేవాడు. నాగరికత, సాంకేతిక ప్రగతి, అవసరాలు ఇప్పటి మనుషుల జీవన గడియారాన్ని గతి తప్పిస్తున్నాయి. దీంతో అనేక సముస్యలు, రుగ్మతలు మనుషులను ముసురుకుంటున్నాయి.
క్రమం తప్పితే మనం క్రమం తప్పి జీవన విధానం సాగిస్తే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. మన జీవప్రక్రియలు క్రమబద్ధంగా సాగడానికి మెదడులోని జీవగడియారం (బయాజికల్ క్లాక్) తోడ్పడుతుంది. దీనిని అనుసరించే జీవ రసాయన చర్యలు జరుగుతాయి. నిద్ర, ఆకలి, శక్తి, సామర్థ్యం, ఉత్సాహం, జ్ఞాపకశక్తి, నైపుణ్యం లాంటి ప్రతి అంశంపై జీవ రసాయనచ ప్రభావం ఉంటుంది. వేళకు ఆహారం, తగిన నిద్ర పోగలిగితేనే అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయి. లేదంటే హార్మోన్లు, జీవ చర్యలు మొరాయించి సమస్యలను సృష్టిస్తాయి.
మనం తగినంత నిద్ర, విశ్రాంతి లేకుండా పనిచేస్తే మస్తిష్కం మొద్దుబారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత క్షీణిస్తాయి. శక్తి సామవ్యాలు నైపుణ్యాలు తగ్గిపోతాయి. గ్రంధులు స్రవించే హార్మోన్లలో అసమతుల్యత చోటుచేసుకుంటుంది. నిద్రలేమి దీర్ఘకాలం కొనసాగితే గుండె సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిళ్ళు పెరిగి మధుమేహం, రక్తపోటు పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కండరాలు, కీళ్ళు, ఎముకలు పట్టుదప్పుతాయి. చిన్న వయస్సులోనే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. మహిళల్లో రుతుక్రమం దారి తప్పుతుంది. ముందు గానే మెనోపాజ్ దశ వచ్చేస్తుంది. మగవారిలోను ఆండ్రోపాజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆహార నియమాలు పాటించకుంటే అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. అజీర్ణం, మలబద్ధకం, ఆకలి మందగించడం జరుగుతాయి. దీనివల్ల తరచు తలనొప్పి, కీళ్ళ ళ్లలో వాపులు, నీరసం, నిస్సత్తువ వస్తుంది.
క్రమం పాటించాలిమనవారు విద్యుత్ లేని రోజుల్లో రాత్రి ఎనిమిదింటికల్లా నిద్రపోయేవారు. ఉదయం కోడికూతతో నిద్రలేచి పనులకు ఉపక్రమించే వారు. అంటే ఎనిమిది గంటలపైగా నిద్రపోయేవారు. పిల్లలైతే మరింత ముందుగా పడుకుని ఆలస్యంగా లేచేవారు. ఆధునిక జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాత్రంతా వెలుగులు చిమ్మే విద్యుత్ దీపాలు నిద్ర సమయాన్ని ఆలస్యం చేస్తున్నాయి. ఇరవై నాలుగు గంటలూ ప్రసారమయ్యే టివి కార్యక్రమాలు నిద్రపట్టనివ్వడంలేదు. అంతర్జాల మాయాజాలంలో పడి చాలామంది నిద్రకు దూరమవుతున్నారు. విద్యార్థులు రాత్రంతా మేలుకుని చదవాల్సివస్తోంది. ఈ నేపథ్యం ప్రతివారిలోని జీవ గడియారం దారితప్పుతున్నది. మానసిక, శారీరక రుగ్మతలకు దారితీస్తున్నది. ఈ పరిస్థితుల నుంచి అందరూ బయటపడాలి. ఎన్ని పనులున్నా.