మాట్లాడే చిలుకలు...
పక్షి జాతుల్లో మాట్లాడేవి రామచిలుకలు ఒక్కటే. ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో సుమారు 350 జాతులు రామచిలుకలు ఉన్నాయి. వాటిలో అన్ని చిలుకలూ మాట్లాడలేవు. వివిధ దేశాల్లోని ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో వాతావరణాన్నిబట్టి రంగులు కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి. చిలుకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి. పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు, చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని, చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలుకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి. వాటికై మాట్లాడలేకపోయినా తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్ల వాటిని పెంచుకుంటున్న క్రమంలో మాటలను నేర్పిస్తే వాటిని గ్రహించడమే కాక, అనుకరిస్తాయి కూడా.