![]() |
సబ్బు నురగ తెల్లనేల?, Soap bubuls are white-Why? |
సబ్బు నురగ తెల్లనేల?, Soap bubuls are white-Why?
కాస్త నీలం రంగు సిరాను గ్లాసుడు నీళ్లలో కలిపితే నీటి రంగు మారుతుంది. ఆ రంగు నీటిని ఒక చెంచాడు తీసుకుని ఒక బకెట్ నీటిలో కలిపితే ఆ నీటి రంగు మారదు.
సబ్బుల తయారీ సమయంలో రసాయనాలకు రంగులు కలపడం ద్వారా రంగురంగు సబ్బుల్ని తయారు చేస్తారు. సబ్బు బిళ్ల పరిమాణం తక్కువ కాబట్టి మనకు సబ్బులో కలిపిన రంగు కనిపిస్తుంది. అదే దాన్ని రుద్దేటప్పుడు మన చేతుల్లోకి వచ్చే సబ్బు పరిమాణం తక్కువగా ఉంటుంది. సబ్బులో కొంత భాగాన్ని నీటిలో కలిపి చిలగ్గొట్టినా వచ్చే నురుగు తెల్లగానే ఉంటుంది. ఎందుకంటే సబ్బు బుడగల పొర చాలా సన్నగా ఉంటుంది. పైగా పారదర్శకం (transparent) కూడా. నురగలో సబ్బు బుడగలు ఎక్కువ సంఖ్యలో కలిసి ఉండడంతో ఒక బుడగలో ప్రవేశించిన కాంతి మరో బుడగ ఉపరితలంపై పడి పరావర్తనం (reflection) చెందుతుంది. ఇలా అనేక బుడగలపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటిలోకి ప్రవేశించడంతో ఆ నురగ మనకు తెల్లగా కనిపిస్తుంది.