-->

కుందేళ్ల ద్వీపం!

 


కుందేళ్ల ద్వీపం!

ఒకప్పుడు సైనికుల స్థావరం అది. విషపూరిత రసాయనాల తయారీ కోసం ఆ ద్వీపాన్ని ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది పర్యాటక ప్రదేశం. ఆ ద్వీపంలో ఎటుచూసినా కుందేళ్లు కనిపిస్తాయి. అందుకే ఆ ద్వీపానికి 'ర్యాబిట్ ఐలాండ్ అని పేరు, జపాన్లో హిరోషిమా, షికొకు నగరాల మద్య ఈ చిన్న ద్వీపం ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ద్వీపం కీలకపాత్ర పోషించింది. విషపూరిత రసాయనాల తయారీని జపాన్ సైన్యం ఇక్కడే చేసింది.  ఇప్పుడు గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు, పార్కులు, బీతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకులు ఈ దీవిని సందర్శించడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే కుందేళ్లు, వాటితో ఫొటోలు దిగడానికి, వాటిని కెమెరాల్లో బంధించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.  ఈ దీవిలో ఒక్క కుక్క కూడా కనిపించదు. అందుకే కుందేళ్లు స్వేచ్చగా తిరుగుతుంటాయి. పర్యాటకులుగా ఇక్కడికి వచ్చే వాళ్లు కూడా కుక్కలు తీసుకురావడం నిషేధం.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT