![]() |
New year |
న్యూ ఇయర్ వేడుకలు ఎప్పుడు మొదలయ్యాయి?
ఈ రోజు న్యూ ఇయర్. కొత్త సంవత్సరం రోజున అందరూ సంతోషంగా వేడుకలు చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్సె లబ్రేషన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలుసా? కొత్త ఏడాది వేడుకలు ఇప్పటివి కావు. నాలుగు వేల క్రితమే ఈ వేడుకలు ఉన్నాయని చెబుతారు. క్రీ.పూ 2000 ఏళ్ల క్రితం బాబిలోనియన్లు కొత్త ఏడాది వేడుకలకు నాంది పలికారు. అయితే జనవరి 1న కాకుండా మార్చి మధ్యలో అంటే వసంతకాలం ప్రారంభ మయ్యే రోజున జరుపుకొనేవారు. అంతేకాకుండా 11 రోజుల పాటు వేడుకలు చేసుకొనే వారు. క్రీ.పూ 158లో రోమన్లు జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభంగా గుర్తించి వేడుకలు జరుపుకొన్నారు. అయితే రోమన్ చక్రవర్తులు మారినప్పుడల్లా ఆ తేదీలు మారాయి. జూలియస్ సీజర్ క్రీ.పూ 46లో జూలియన్ క్యాలెండర్‌ను రూపొందించి తిరిగి జనవరి 1ని రోమన్ న్యూ ఇయర్‌గా ప్రకటించారు. క్రిస్టియన్ సంప్రదాయాలకు విరుద్దంగా ఉందని యూరప్ లోని క్యాథలిక్ చర్చ్ లు వాదించాయి. తరువాత క్రమంలో క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ 25, మార్చి 1, మార్చి 25 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొన్నారు 1582లో పోప్ గ్రెగరీ 13 గ్రెగరియన్ క్యాలెండర్‌ను రూపొందించి జూలియన్ క్యాలెండర్లో ఉన్న తప్పులను సవరించారు. జనవరి 1 న్యూఇయర్ డేగా తిరిగి ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనవరి 1న కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.