![]() |
flying snake |
ఎగిరే పాము!
పాములు వేగంగా పరుగెత్తుతాయి. గాల్లో కూడా ఎగురుతాయి. ఆదేంటి? పాములు వేగంగా పరుగెత్తుతాయని తెలుసు కానీ, గాల్లో ఎగరడం ఎప్పుడూ చూడలేదే అంటారా? దీని పేరు క్రిసోపీలియా. దీన్ని ఫ్లయింగ్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ఇండియా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో ఈ పాములు కనిపిస్తాయి. ఇవి ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి ఎగురుతాయి. ఇవి దాదాపు 100 మీటర్ల దూరం వరకు ఎగరగలవు. ఎక్కువగా ఆహారం కోసమే ఒక చెట్టు పైనుంచి మరో చెట్టుకు దూకుతాయి. ఈ పాములు బల్లులు, కప్పలు, పక్షులు, ఎలుకలను తింటాయి. ఈ పాములు వాటి తోకను ల్యాండింగ్ గేర్ గా ఉపయోగించుకుంటాయి. దూకిన తరువాత చెట్టు కొమ్మల మీద ముందుగా తోకను తాకిస్తాయి. అయితే గాలిలో ఇవి తమ దిశను మార్చుకోలేవు. ఒకే దిశలోనే దూకుతాయి. ఇవి విషపూరితమైనవి కావు. ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిలో కొన్ని వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ పాములు రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు పొడవు ఉంటాయి.