What is purpose of satellite sent in space ||prudhviinfo
 |
space |
అంతరిక్షంలోకి మానవరహిత అంతరిక్షనౌకల్ని ఎందుకు పంపుతారు. వాటివల్ల ప్రయోజనాలు ఏమిటి?
*పయనీర్-10, వాయేజర్-1, వాయేజర్-2 లాంటి అనేక మానవరహిత అంతరిక్షనౌకల్ని అంతరిక్షంలోకి పంపారు. ఇంకా అవసరాన్ని బట్టి పంపుతున్నారు. ** *సౌరవ్యవస్థలోని భాగాలను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ** *ఇవి ఎన్నో ఛాయాచిత్రాల్ని తీసి భూకేంద్రానికి పంపుతున్నాయి. ఈ ఛాయా చిత్రాలు శాస్త్రీయవిజ్ఞానం కోసమేగాక ఇతర గ్రహాలు, చందమామ పైకి మానవసహిత అంతరిక్షనౌకలు పంపే మార్గాలు ఎలాగో తెలుపుతాయి. ** *శుక్రుడు, అంగారకుడిపైన ఉన్న వాతావరణం, వాటి ఉపరితలం ఎలా ఉన్నదో? కొంత సమాచారం ఈ అంతరిక్షనౌకల వల్లే తెలిసింది. ** *నిర్దేశించిన పనులతో పాటు ఖగోళ వస్తువుల సమాచారం తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ మానవరహిత అంతరిక్షనౌకల్లో ఉంచారు. అక్కడ జీవులుంటే భూవాతావరణం, భూమి మీద ఉన్న మానవుల గురించి సమాచారం తెలుస్తుంది. వీటిలో మనుషులకు సంబంధించి అనేక ఛాయాచిత్రాలు, 53 భాషల్లోని స్వరాల రికార్డింగ్, చంటి పిల్లల ఏడ్పులు, మానవుడి గుండెచప్పుళ్లు, పక్షుల రాగాలు, సాగర ఘోషల శబ్దాల రికార్డింగ్లు ఉన్నాయి.