-->

నవరసాలనగా ఏవి ?

 
NAVARASALU

నవరసాలనగా ఏవి?

రసం అంటే ఒక భావోద్వేగ స్థాయి (emotional state). ప్రాచీన భారత దేశపు భరతముని తన నాట్య శాస్త్రం లో ఎనిమిది రసాలను నిర్వచించారు. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా (వలన) ఒక్కో భావాన్ని ప్రేక్షకులలో సృష్టించగలుగుతాడు. తరువాత అవసరాన్ని బట్టి వాడుకోటానికి అనుగుణంగా ఈ ఎనిమిదింటికీ శాంత రసాన్ని ఉపగుప్తుడు జోడించాడు. నటనకూ నాట్యానికీ సమానంగా ఉపయోగ పడే ఈ రసాలు ఈనాటికీ మన భారతీయ కళలకు మూలాధారం. ప్రతీ కళాకారుడూ ఈ రసాలను ఎరిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ రసాలను సాదించటాన్ని రసాభినయం అంటారు. ఈ రసాలు సాహిత్యము లోనే కాదు .. మనస్సులోనూ ఉంటాయి . ఏదైనా ఆపద కలిగితే మనము దు:ఖిస్తాము. మంచివిషయము సంభవించినపుడు సంతోషిస్తాము . . మన ముఖాలు నవ్వుతూ ఉంటాయి. ఒకపామో , మరేదైనా క్రూరమృగమో కనబడితే భయము తో వణికిపోతాం . ఏదైనా అన్యాయము గానీ , అత్యాచారము గానీ మనకళ్ళ ఎదుట జరిగితే కోపగ్రస్తులమవుతాం . ఏదైనా విచిత్రమైన అకటవికటపు దృశ్యము చూస్తే విరగబడి నవ్వుతాం . భగవంతుని దర్శించినపుడు శాంతంగా కదలక మెదలక నిలుచుంటాం . జీవతములో రసాలన్నీ అనుభవంలో ఉన్నవే .


నవరసాలు :
1.శృంగారం 2.హాస్యం 3.కరుణ 4.రౌద్రం 5.వీరం 6.భయానకం 7.భీభత్సం 8.అద్భుతం 9.శాంతం.

1.శృంగారం: ఇది రతి అనే స్థాయీభావం నుండి పుడుతుంది.సౌందర్యం శృంగారంలో ప్రధానమైన అంశం.అందంగా ఉన్న వాటికి మనసు హత్తుకుపోతుంది. ఇవి రెండు రకాలుగా ఉత్పన్నమవుతుంది …a.సంయోగం b.వియోగం. సంయోగం అంటే కలయిక…వియోగం అంటే ఎడబాటు…


2.హాస్యం : ఇది హాసం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది రెండు రకాలు--a.ఆత్మస్థ = తాను నవ్వటం b. పరస్థ = ఇతరులను నవ్వించటం

నవ్వు ఆరు రకాలుగా ఉంటుంది. అవి

a.స్మితము (Gentle Smile) : చెక్కిళ్లు లేతగా వికసించి పలువరుస కనబడకుండా గంభీరంగా ఉండే నవ్వు.

b.హసితము (Smile) : చెక్కిళ్లు వికసించి, పలువరుస కొంచెంగా కనిపిస్తుండే నవ్వు.

c.విహసితము (Laughter) : సమయోచితమైన నవ్వు.ముఖం ఎరుపెక్కి పలువరుస కనిపిస్తూ శిరస్సు ముడుకుని ఉంటుంది.

d.ఉపహసితము (Laughter with ridicule) : ముక్కుపుటాలు విప్పారి.చూపులు వక్రంగా ఉండే నవ్వు.

e.అపహసితము (Uprorious Laughter) : ఏడుపు వస్తున్నప్పుడు వచ్చే నవ్వు.

f.అతిహసితము (Convulsive Laughter) : నవ్వు పెద్దదయినపుడు వచ్చే ఆనందబాష్పాలు.స్వరం మారటం,చేతులు కదలడం దీనిలో గమనించవచ్చు.


3.కరుణ : ఇది శోకం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇవి మూడు రకాలు.

a.ధర్మోపగతము : కరుణ దండన నుండి పుడుతుంది

b.అర్ధోపచేయము : ధననష్టం వల్ల కలుగుతుంది.

c.శోకం : ఇష్టజనుల వియోగం వల్ల కలుతుంది.


4.రౌద్రం : క్రోధం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.రాక్షస ప్రకృతులకు సంబంధించినది.సంగ్రామం వల్ల పుడుతుంది.చేయిదాటిపోయిన వికారస్థితి ఇది.

a.క్రోధం,ఆధర్షణము(ఇతరుల భార్యలను చెరచటం వల్ల కలిగేది),b.అధిక్షేపం (దేవ,జాతి,అభిజన,,విద్య,కర్మలను నిందించటం వల్ల కలిగేది),c.అవమానం,అసత్యవచనం,ఉపఘాతం ,పనివారిని


బాధించడం వల్ల కలిగేది),d.వాక్పారుష్యం,e.అభిద్రోహం (హత్యాప్రయత్నం),f.అసూయ. వీటి వల్ల కలుతుంది.


5.వీరం : ఉత్సాహం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది మూడు రకములు.ఆలోచన ఆధిపత్యం కలిగివున్న ఉన్నత ప్రకృతికి చెందిన స్థితి ఇది.

a.దాన వీరము b.దయా వీరము c.యుద్ధ వీరం. .అసంమోహం (కలత చెందకుండటం) .అధ్యవసాయం ( పట్టుదల).నయము (సంధి,విగ్రహాల ప్రయోగం .వినయం (ఇంద్రియ జయం),.బలం


< p>(చతురంగ బలం కలిగివుండటం) .పరాక్రమం (శతృవుల జయించటం) .శక్తి ( యుద్ధాదులయందు సామర్ధ్యం),.ప్రతాపం (శతృవులకు సంతాపం కలిగించే ప్రసిద్ధి) .ప్రభావం (అభిజన,ధన,మంత్రి


సంపద) వల్ల ఉత్సాహం కలుగుతుంది.


6.భయానకం : ఇది భయం అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.అపరాధం వల్ల,మోసం వల్ల,హింస వల్ల కలుగుతుంది.ఇవి రెండు రకములు--a.స్వభావసిద్ధమైనది b.కృత్రిమమైనది


7.భీభత్సం : జుగుప్స అనే స్థాయీభావం నుండి పుడుతుంది.కోపం,అయిష్టం,విసుగు,అసహ్యం వల్ల జుగుప్స కలుగుతుంది.


8.అద్భుతం : ఇది విస్మయం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.దైవ సంబంధిత విషయాలు,మహాత్ముల దర్శనం,ఇంద్రజాల,మహేంద్రజాలాదులను ప్రత్యక్షంగా డటంవల్ల…మనోవాంఛలు తీరటం వల్ల ఈ రసానుభవం కలుగుతుంది.


9.శాంతం : ఇది శమము అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.తత్వఙ్ఞానం,వైరాగ్యం,ఆశయ శుద్ధి వల్ల ఇది జన్మిస్తుంది.మోక్షము పట్ల ఆసక్తి కలిగిస్తుంది.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT