శరీరము లో అతి పెద్ద అంగమేది ?, What is the biggest Organ in the body?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ PRUDHVIINFO.
ప్ర : శరీరము లో అతి పెద్ద అంగమేది ?.
జ : శరీరములో అతిపెద్ద అంగం ఏది అనగానే అందరూ లోపలి అంగాల గురించి ఆలోచిస్తారు ... కాని వాస్తవం లో అతి పెద్ద అంగం చర్మము . చర్మము అంగమని చాలా మందికి తెలియదు . మనిషి బరువులో16 శాతము బరువు చర్మానిదే . సాధారణ మానవుడి చర్మము మొత్తము బయటకు తీసి కొలిస్తే 1.85 చదరపు మీటర్లు ఉంటుంది . అమ్మయిల శరీరములో కన్నా అబ్బయిల శరీరములొ చర్మము అధిక విస్తీర్ణము కలిగి ఉంటుంది .
చర్మము రక్షణ అవయవము ,
చర్మము విసర్జక అవయవము ,
శరీర ఉష్ణోగ్రతను సమతుల్యము చేస్తుంది .