![]() |
ఓడిపోవడం తప్పు కాదు... |
ఓడిపోవడం తప్పు కాదు....
మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు ఓటమిని చూస్తూనే ఉంటారు. కానీ అందరూ ఒకేలా ఉండరు కద సున్నిత మనస్తత్వం ఉండే వాళ్లు మరింత కుంగిపోతారు. పదే పదే వాళ్లు జరిగిన దాని గురించి తలచుకుని బాధపడుతూ ఉంటారు. నిజానికి ఓటమి తప్పు కాదు. ఓడిపోయిన అన్ని తిరిగి ప్రయత్నించకపోవడం అసలైన తప్పు.
పరీక్ష ఉద్యోగం వ్యాపారం ప్రేమ కుటుంబం బాధ్యతలు ఇలా విఫలం కావచ్చు ఓడిపోయాను అని అపరాధ భావంతో ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు. తీవ్రమైన నిరాశతో పొంగిపోతూ ఉంటారు.
కారణాలు అన్వేషించాలి:
![]() |
కారణాలు అన్వేషించాలి |
సహజంగా మనం ఓడిపోతే మనం దేనికి పనికి రాము అని మనల్ని మనము ఊహించుకుంటాము.నువు ఓడిపోయిన తర్వాత నేను దేనికి పనికి రాను అని ఒక ఆలోచన కి రాకూడదు. నువ్వు ఎందుకు ఓడిపోయావు అన్నీ అన్వేషించాలి. మళ్లీ మన జీవితంలో అలాంటి విషయాలు జరగకుండా జాగ్రత్త పడాలి. మీ గురించి మీ కంటే బాగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి జరిగిన పొరపాట్లను గుర్తించి అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలి.
చెడు అలవాట్లు:
![]() |
చెడు అలవాట్లు |
ఓడిపోయాను అని భావన ప్రతి ప్రతి గుర్తుకు వస్తూ ఉంటే కొంతమంది చెడు అలవాట్లకు బానిస అవుతూ ఉంటారు. అతిగా నిద్రపోవడం అతిగా తినటం ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటారు. ఇలా చేయడం వల్ల మరింత మానసిక బాధ తప్ప ఇంకేమీ ఉండదు.
ప్రేరణ పొందాలి:
![]() |
ప్రేరణ పొందాలి |
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక అవగాహన రావడానికి ఓటమి నుంచి ప్రేరణ పొందాలి.నిజానికి నువ్వు ఆపదల్లో ఉండేటప్పుడు నీకు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అర్థమవుతుంది. ఆ సమయంలో మీకు ఎవరైతే నచ్చుతారు వాళ్ళ మాటలు విని ఆచరించండి. ఓటమి నేర్పిన పాఠాలతో మన జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవచ. ఆ దిశగా అడుగులు వేయడానికి మెల్లగా ప్రయత్నాలు ప్రారంభించు.