![]() |
Teeth pain |
పంటి నొప్పికి...
పంటి నొప్పి ఎంత భయానకంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క పన్ను నొప్పి పుట్టినా మొత్తం నరాలన్నీ లాగేస్తున్నంత బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి ఏర్పడుతుంది. ఇది ఒక్కసారి మొదలైందంటే అంత ఈజీగా తగ్గదు. ఈ నొప్పి తగ్గాలంటే తప్పకుండా డెంటిస్టును సంప్రదించాల్సిందే. ఒక వేళ మీ వద్ద అంత సమయం లేకున్నా.. తక్షణ ఉపశమనానికి
ఈ కింది చిట్కాలను పాటించండి.
వేడి నీటిలో కాస్త ఉప్పు వేసి బాగా కలపండి.ఉప్పు కరిగిన తర్వాత ఆ నీటిని నోటిలో వేసుకుని పుక్కిలించండి. ఈ ద్రావణం సహజమైన యాంటీ సెప్టిక్ పని చేస్తుంది. కనీసం 30 సెకన్లపాటు ఉప్పు నీటిని పుక్కిలించండి. దీనివల్ల దంతాల చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. ఇన్ఫెక్షన్లు కూడా పెరగవు.నొప్పి ఎక్కువగా ఉంటే వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించండి.లవంగాలతో పంటి నొప్పి నుంచి విముక్తి ఉంటుంది. ఇందులో ఉండే యుగేనల్ అనే రసాయన పదార్థం తేలికపాటి మత్తును కలిగిస్తుంది. నొప్పి వచ్చే పంటి వద్ద లవంగాన్ని ఉంచి కొద్దికొద్దిగా నమలాలి.
దీని వల్ల అందులో నుంచి నూనె విడుదలై పంటి నొప్పి తగ్గుతుంది.నొప్పి తగ్గించేందుకు లవంగ నూనె కూడా వేసి నొప్పి వచ్చే దంతాలపై ఉంచాలి.ఉపయోగించవచ్చు. దూది పై రెండు చుక్కలు లవంగ నూనె వెల్లుల్లిని బాగా దంచి.. టేబుల్ సాల్ట్ లేదా మిరియాలతో కలిపి నొప్పి కలిగిస్తున్న పంటిపై ఉంచండి. దీని వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది. లేదా వెల్లుల్లి రెబ్బలను నమలినా నొప్పి తగ్గుతుంది. దంచిన వెల్లులితోనే ఎక్కువ ఫలితం ఉంటుంది.