![]() |
HEADACK |
తల నొప్పిని క్షణాల్లో తగ్గించే చిట్కాలు!
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తలనొప్పివస్తుండడం సహజం. అలాగే వేరే విషయాల్లోనూ మనకు తలనొప్పి వస్తుంటుంది ఇక వేసవిలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే తలనొప్పి కచ్చితంగా వస్తుంది.
మనకు ఎలాంటి తలనొప్పి వచ్చినా సరే మనం ఎలాంటి పని చేయలేము. తలనొప్పికి తల తీసి పక్కన పెట్టాలి అనిపిస్తుంది. కానీ కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే ఎలాంటి తలనొప్పినైనా ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి.
చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము...
• ఎండలో తిరగాల్సి వస్తే తలకు హాట్ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకుంటే మంచిది. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది.
• ఎండలో తిరగడం వల్ల వచ్చిన తలనొప్పి అయితే కొంత సేపు చల్లని నీడలో ఉంటే ఇట్టే తగ్గిపోతుంది. చల్లని ప్రదేశంలో ఉండి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. మొన్న కళ్ళను బాగా కడగాలి. దీని వల్ల మనస్సుకు హాయిగా అనిపిస్తోంది. రిలాక్స్ అయిన భావన కలిగి తలనొప్పి తగ్గుతుంది.
• నీటిని తగినంత తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కనుక నిత్యం తగు మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాదు.
• చల్లని కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇతర సహజ సిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది.వట్టివేరుతో చల్లని పానీయం తయారు చేసుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.అరటి పండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.