ఎంత నిద్ర అవసరం
మీ వయసు, బరువు,రోజూ మీరు చేసే పనులు,ఆరోగ్య స్థితి వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని మీకు ఎన్ని గంటల నిద్ర అయితే సరిపోతుందో నిర్ధారించుకోవచ్చు. అయితే అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన లెక్క ఇది అంటూ వరల్డ్ స్లీప్ ఫౌండేషన్ లెక్కలను విడుదల చేసింది. దీని ప్రకారం...
![]() |
Adult (7 to 9 hours) |
• పెద్దవారు (20 నుంచి 65 సంవత్సరాల వారు) 7నుంచి 9 గంటలు
![]() |
65 to... (7 to 8 hours) |
*65 ఏండ్లకు పైబడిన ముసలి వారు 7 నుంచి 8 గంటలు
![]() |
7 to 19 years (9 to 11 hours per day) |
*7 నుంచి 19 సంవత్సరాల వయసున్న వారు 9 నుంచి 11 గంటలు
![]() |
BELOW 7 YEARS (10 TO 13 HOURS PER DAY) |
*7 ఏండ్ల కంటే చిన్న పిల్లలు 10 నుంచి 13 గంటలు
![]() |
1 MONTH TO 1 YEAR CHILDREN (17 HOURS PER DAY SLEEPING) |
• నెలల వయసు నుంచి సంవత్సరం వయసున్న పిల్లలు 17 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది.
రోజూ మీరు చేసే పని ఆధారంగా మీకు అవసరమయ్యే నిద్ర తగ్గడం లేదా పెరగడం జరుగుతుందని స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. దీంతో పాటు మీకున్న ఆరోగ్య సమస్యల ఆధారంగా కూడా నిద్ర పోవాల్సి ఉంటుంది. మరి, మీకు మీరు చేసే పని ఆధారంగా ఎన్ని గంటల నిద్ర అవసరమవుతుంది. లెక్కించడానికి ఓ పద్ధతి ఉంది. దాని కోసం మీరు ఎన్ని గంటల పాటు పడుకుంటే మరుసటి రోజు ఆనందంగా, హాయిగా ఉంటూ పని ఎక్కువగా చేయగలుగుతారో గమనించండి. దీంతో సమాధానం మీకు సులభంగా దొరకొచ్చు. దాంతో పాటు మీకు ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల అలసట ఎక్కువగా ఉంటుందా?గుర్తించండి. మీరు చేసే ఉద్యోగంలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందా? ఆలోచించండి. మీరు సరిగ్గా నిద్రపోయినా పగలు నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తోందా? కాఫీ, టీలు లేకుండా పనిచేయలేకపోతున్నారా? అయితే మీకు మరింత నిద్ర అవసరం అని గుర్తించండి. మీరు ప్రస్తుతం పడుకున్న దానికంటే ఒక గంట ఎక్కువగా నిద్రపోయి ఆ తర్వాత
రోజు మీరు యాక్టివ్ గా ఉన్నారేమో చెక్ చేయండి.
ఆదివారాలు, హాలిడేలు ఎక్కువగా నిద్రపోవడం కొందరికి అలవాటు. దీనివల్ల సోమవారం కూడా బద్దకంగా అనిపిస్తుంది. ఇలాంటివి కాకుండా సాధారణంగానే మీకు
నిద్ర తక్కువైనట్టు అనిపిస్తోందా? చెక్ చేసుకోవాలి.చాలామంది తాము తక్కువ సమయం నిద్రపోయినా తమకేమీ కాదని భావిస్తుంటారు. చాలామంది వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు కూడా తక్కువ సమయమే నిద్రపోతారని అదే పద్ధతిని వీరూ పాటిస్తుంటారు. కానీ ఇది సరికాదని నిపుణులు వెల్లడిస్తారు. వీరిలో పని చేసే ఉత్సాహం తగ్గి.. చేసే పనిలో నాణ్యత కూడా తగ్గుతుందని వెల్లడిస్తున్నారు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి దీన్ని వారు గుర్తించడం కూడా కష్టమే.అంటున్నారు స్లీప్ ఎక్స్ పర్ట్స్.
ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.పగలంతా పని చేయడం వల్ల కండరాలు ఆలసిపోతాయి.వాటిని పునరుత్తేజం పొందించేందుకు.. కొత్త కణాలు రూపొందేందుకు.. అలాగే మెదడు కూడా పనితీరు మెరుగుపర్చుకునేందుకు నిద్ర ఎంతో అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే అది శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్, గుండె పోటు,నరాలకు సంబంధించిన సమస్యలు,యాంగైటీ, డార్క్స సర్కిల్స్ ముడతలు వంటి ఎన్నో సమస్యలు ఎఎదురవుతాయి