-->

కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా? || PRUDHVIINFO

కొలెస్ట్రాల్


కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?

కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే మనం  చెప్పుకుంటూ ఉంటాం.కానీ కొలెస్ట్రాల్లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాలను హెడీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ ను ఎడిఎల్ అంటారు.మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్తపరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 


12 గంటల పాటుఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్),హెచ్ డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎలను "చెడు కొలెస్ట్రాల్"అని అంటారు. కానీ హెడీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎలను “మంచి కొలెస్ట్రాల్" అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెడీఎల్ ఎక్కువగా, ఎల ఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. 


పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు మనకు చెబుతుంటారు.  ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ను అదుపులో పెట్టుకోవచ్చు.



PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT