-->

మారడానికి ప్రయత్నించండి


 మారడానికి ప్రయత్నించండి

ఈర్ష.. మన పతనానికి ఇది నాంది. ఎవరైనా, ఏదైనా బాగా

ఉంటే చాలు ఈర్ష్య పడిపోతుంటారు కొందరు. అది కుదురుగా

కూర్చొనివ్వడు. పని చేసుకోనివ్వడు అంతా చిరాకు. అంతులేని

ప్రేమలో అంతు చిక్కకుండా దాగి ఉంటుంది. ఈర్ష్య, ఇది

లేనివారు ప్రపంచంలో చాలా తక్కువ. ప్రతి వారిలో ఏదో ఒక

మూల ఎంతో కొంత మోతాదులో దాగి ఉంటుంది. మనిషిని

ఇంతలా విచ్ఛిన్నం చేస్తున్న ఈర్ష్యను తగ్గించుకోవడం ఎలా?

నిపుణులు సలహాలు ఎంటో తెలుసుకుందాం.

• మన జీవితంలో చేదు అనుభవాలు, మధురానుభూతులు రెండూ

ఉంటాయి. వీటిని ఒసారి తులన్మాతకంగా విశ్లేషించుకోవాలి. జీవితంలో అన్నీ

చేదు అనుభవాలే ఉండవు కొంతైనా మంచి సంఘటనలు ఉంటాయి. ఏదైనా

మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. ఓటములనే గుర్తుచేసుకుంటూ ఉంటే

మనలో ప్రతికూల భావాలు గురించే ఆలోచిస్తాం. అదే సానుకుల ఆలోచనల్ని

అలవరచుకున్నప్పుడు మనలోని ప్రతికూల భావాల్ని కొంత వరకు బ్యాలెన్స్ చేస్తాయి.

- ఇతరుల అలవాట్లను చూసినప్పుడు, వారి భావాలను విన్నప్పుడు ఈర్య

పుడుతోంది. అలాంటి భావన సమంజసమేనా అని కాస్త ఆలోచించాలి. ఆ ఆలోచనే

మీలో మార్పునకు మొదటి మెట్టు. మనతో సాధ్యపడనిది ఇతరులకు సాధ్యమైనప్పుడు

వారిపట్ల

ఈర్య కలుగుతుంది. ఈ విషయాన్ని ఓసారి సరిగ్గా విశ్లేషించుకోవాలి. వాళ్ళ దగ్గర

ఉన్నది. మీ దగ్గర లేదనో.. ఒకరికి కలిగిన మధురానుభూతి మీకు కలగలేదనో... మీరు

అభద్రతా భావానికి లోను కాకుండా మీ జీవితంలో మీరు ఓ మంచి అనుభవాన్ని

గుర్తుచేసుకోండి,

• మీతో పాటు అందరికీ తీపితో పాటు చేదు అనుభవాలు ఉంటాయనే విషయం అర్ధం

చేసుకోండి. వారు ఆ సమయంలో సంతోషంగా కనిపించవచ్చు కానీ అంతకు ముందు

వారు ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారనే విషయాన్ని అర్ధం చేసుకోండి. ప్రతికూలతలను

అనుకూలంగా మార్చుకునేవారు జీవితంలో విజయం సాధించడంలో సఫలం అవుతారు.

• ఎవరిమీదైనా మనకు ఈర్య ఇప్పటికే ఏర్పడిపోయిందేమో మనలోకి మనమే తరచి

చూసుకోవాలి. ఉంటే అనుమానం లేకుండా ఈర్యకు లోనయ్యామనే విషయాన్ని

ఒప్పుకోవాలి. దీంతో మీ లోపాన్ని మీరు గుర్తించినట్టు అవుతుంది. అప్పుడే దీన్నుంచి త్వరగా

బయటపడేందుకు అవకాశం ఉంటుంది.

• ప్రపంచంలో ఎవరూ ఎవరి ఆధీనంలోనూ ఉండరని గ్రహించాలి. అది కుటుంబ

సభ్యులైన సరే.. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని ముందుగా గుర్తించాలి. ఆలోచనే

కాదు.. ప్రయత్నం కూడా ముఖ్యం. ఇక మీలో ఉన్న ఈర్యను పక్కకు పెట్టి మారడానికి

ప్రయత్నించండి.


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT