-->

దేనికైనా కాలం కలసి రావాలి...

 

LIFE

దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.


సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.


ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.


తాళం తో పాటే తాళం చెవి

కూడా తయారు చేయబడుతుంది.

ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.

అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను

భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.


: తూటా కంటే శక్తివంతమైనది మాట!

ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,

ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు


మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,

కత్తెర లాగ కాదు.

సూది పని ఎప్పుడూ జోడించడమే,

కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,

అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.

కత్తెర లాగా విడదీస్తూ కాదు..


నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,

కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.


నీవు సంతోషంగా ఉన్నావంటే

నీకు సమష్యల్లేవని కాదు,

వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం

నీకున్నాయని…


స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,

యోధుడిని యుద్ధంలోను,

భార్యను పేదరికంలోను,

గొప్పవ్యక్తిని అతని వినయంలోను

పరీక్షించాలి.


చేసిన తప్పుకు క్షమాపణ

అడిగినవాడు ధైర్యవంతుడు.

ఎదుటి వారి తప్పును

క్షమించగలిగిన వాడు బలవంతుడు.

కష్టం అందరికీ శత్రువే, కానీ

కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,

సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.


ఓటమి లేనివాడికి అనుభవం రాదు,

అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.

గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,

ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.

ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.

ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు

ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,

గెలుస్తావు.


ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,

గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.

ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.

అదే తేడా…


గెలవాలన్న తపన,

గెలవగలను అన్న నమ్మకం,

నిరంతర సాధన.

ఈ మూడే నిన్ను గెలుపుకు

దగ్గర చేసే సాధనాలు.


నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ

ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…

ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.


స్వయంకృషితో పైకొచ్చినవారికి

ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,

అహంకారం ఉండదు.


మూర్ఖుడు తాను ఇతరులకు

మోసం చేయగలుగుతున్నాను కాబట్టి

తెలివి గలవాణ్ణి అనుకుంటాడు.

అది తన పిచ్చితనమని,

తన నాశనానికి దారితీస్తుందని గ్రహించడు.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT