-->

మనసా,వాచా,కర్మణా అంటేఏమిటి?

 

మనసా,వాచా,కర్మణా అంటేఏమిటి?


 ఒకసారి శ్రీ ఆది శంకరాచార్యుల వారు, శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు...

 గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట...

 _" నేను 3 దోషములు


 పాపములను చేశాను, నన్ను క్షమించండి  

 అని ప్రాధేయ పడ్డారు..._ 

ఇది విన్న శిష్యులు “ ఆచార్యులవారు, ఏమి పాపములు చేశారో ప్రాయశ్చిత్తపడుతున్నారు ?” అని అనుకున్నారు...


 ఒక శిష్యుడు,ఏమిటిస్వామి ఆ పాపము నేను తెలుసుకోవాలి అనిఉంది, ఆచార్యుల వారిని అడిగాడు.


దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు...


 1. “నేను భగవంతుడిని

 సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను, సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను..."


 అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను, అది నేను చేసిన మొదటి దోషము అని సమాధానమిచ్చారు.


 2. తైత్తిరీయ ఉపనిషత్తు లో  

    "యతో వాచో నివర్తన్తే" అప్రాప్య మనసా సః* *భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన రెండవ తప్పు!


 3. నిర్వాణ శతకం లో

“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం

న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః

అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం “అని వ్రాశాను


 అర్థము :


 నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు .మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము , భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు!


  చిదానంద స్వరూపుడను , శివుడను ,శివుడను! 


 ఇంత వ్రాసికూడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను... అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. 


 అందుకనే నేను చేసిన ఈ మూడవ తప్పు...


 ఈ తప్పులని మన్నించమని , ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు...


 నీతి :

 మన ఆలోచన , తీరు , మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి సంభాషణ మనకి తెలియజేస్తోంది...


 బైట ప్రపంచం మన పని తీరుని మట్టుకె చూస్తుంది,


 భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.


“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”

 ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము. 


 చెప్పేది, చేసేది, ఆలోచించేది ఒక్కటే ఉండాలి దానినే త్రికరణ శుద్దిగా అంటారు

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT