![]() |
LOVE ❤️ |
ప్రేమను అందించిన అమ్మానాన్నలను ,అన్నదమ్ములను, అక్క చెల్లిలను,భర్త, బిడ్డల్నీ,విశ్వమంత ఓపికతో నన్ను భరించే స్నేహాన్ని, నా స్నేహితులని ప్రేమించా... :)
వారికి ప్రేమతో ప్రేమ పూర్వక ప్రేమదినోత్సవ శుభాకాంక్షలు.
ప్రేమంటే ఏమిటి..? ప్రేమ ఎలా చిగురిస్తుంది..? ప్రియుడు.. ప్రియురాలు మధ్య కలిగేదే ప్రేమా..? అసలు ప్రేమకు నిర్వచనం ఏమిటి..? ఇలా ప్రేమపై ఎన్ని సందేహాలున్నా... ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా... ప్రేమ అనిర్వచనీయం... మధురాతిమధురం. ఎంతపంచినా తరగని గొప్పదనం ప్రేమ సొంతం...
ఈ సృష్టిలో, సమస్త మానవాళిలోనే కాదు... సమస్త జీవరాశిలోనూ ప్రేమ దాగుంది..ఆప్యాయతలు అనురాగాలతో పెనవేసుకున్న బంధమే ప్రేమ పసిగుడ్డుగా కళ్లు తెరిచింది మొదలు... ప్రాణం విడిచే వరకు ప్రతి మనిషి ప్రేమకు పాత్రుడే...మొదట తల్లిదండ్రుల ప్రేమ,తర్వాత తోబుట్టువులు,ఆ తర్వాత జీవిత భాగస్వామి...పిల్లలు... ప్రతి మనిషి జీవితంలో ఇలా కుటుంబమంతా ప్రేమ పెనవేసుకుంటుంది..
కళ్లకు నచ్చినవారిని సొంతం చేసుకోవడానికి, వారితో సంబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేది కాదు ప్రేమంటే...అలాగే అవసరం కోసం, ఆర్థిక లాభం కోసం ఇతరులతో జీవిత బంధాన్ని ఏర్పరచుకోవాలనుకోవడం సైతం ప్రేమ కాదు...అసలు ఎదుటివారి నుంచి ఏదో ఒకటి ఆశించి, దానిని నెరవేర్చుకోవడం కోసం ప్రేమ అనే పేరుతో వారితో సంబంధాన్ని ఏర్పరుచుకోవడం.. ప్రేమ కాదు...
ఎవరికోసమైతే మనసు నిజంగా స్పందిస్తుందో వారికోసం ఏమైనా చేయగలగడమే.... అంతేకాదు అలా మనసుకు నచ్చిన వారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం వారి సుఖం కోసమే ఆలోచించగలగడమే నిజమైన ప్రేమంటే...అది తల్లిదండ్రులపైనే కావచ్చు, ప్రేయసీ, ప్రియుల మధ్యే కావచ్చు...బంధం ఏదైనా ప్రేమ అనిర్వచనీయం...మధురాతిమధురం....
Happy Valentines Day
మీరు ప్రేమించే వాళ్ళకి షేర్ చేయండి ❤️