సమాజం చెబుతున్న పచ్చి అబద్ధం..
ఓ యువతా!!!
సమాజం నీకు అబద్ధాలు చెబుతుంది తెలుసా!
ఏమిటి నవ్వు వస్తుందా? నీకు తెలిసినదే నిజమనుకునేటప్పుడు నవ్వు రావడం తప్పేమీ కాదు..
సరే.. నా మాటల్లో నిజమెంతో చూద్దాం..
ముందు నీ చదువుగురుంచి సమాజం ఎన్ని అబద్దాలు చెబుతుందో చూద్దాం..
కష్టపడి చదువుకో, మంచి మార్కులతో పాస్ అవ్వు, మంచి ఉద్యోగం వస్తుంది అని చెబుతుంది.. మంచి మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించిన వాడిని ఎవరైనా కనబడ్డారా నీకు. కాగడాపెట్టి వెతికినా ఎవ్వరూ కనబడరు, నాది గ్యారంటీ..
మంచి మార్కులతో పాస్ ఐయ్యాక, మళ్ళీ పోటీ పరీక్షల వ్రాయాలి..అందులో కూడా మంచి మార్కులు రావాలి..ఐయినా ఉద్యోగం రాదు, ఎందుకో తెలుసా? రిజర్వేషన్స్ ఉంటాయి..ఒక్కో ఉద్యోగానికి వందమంది కి పైగానే నీలాంటోళ్లు పోటీ పడుతున్న పరిస్థితి..ఇందుకోసం బోలెడు ఉదాహరణలున్నాయి కూడా
ఇంకో భయంకరమైన వాస్తవం కూడా తెలుసుకో..నీలాంటి వాళ్ళు సంవత్సరానికి కోటి మందికి పైగానే డిగ్రీలు చేత్తో పట్టుకుని ఉపాధి అవకాశాల కోసం రోడ్డు మీదకు వచ్చేస్తున్నారు.. వాళ్ళందరిలో నువ్వు కూడా ఒకడివి..వాళ్ళందరూ కూడా నీకు పోటీదారులే..వాళ్ళతో పోటీ పడీ, పడీ చివరకు విసుగొచ్చి, ఇదే సమాజాన్ని తిట్టుకుంటూ ఏదోలా బ్రతికేయడానికి అలవాటు పడిపోతావ్.
ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోకపోయినా ఇలాగే కొనగుతుంది నీ జీవితం..
ఇది తధ్యం..
ఇది తధ్యం..