
Useful information

కొన్ని విశేష ధర్మాలు
1, విజ్ఞానాన్ని దాచుకోకుండా పంచడం గురు ధర్మం
2, భయభక్తులులతో విద్య నేర్చుకోవడం శిష్య ధర్మం
3, న్యాయ పరంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యాజమాని ధర్మం
4, భర్త సంపాదన జాగ్రత్తగా పెట్టి సంసారం నడపటం ఇల్లాలి ధర్మం
5, సైనికుడుగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనిక ధర్మం
6, వృద్ధులైన తల్లి తండ్రులను ఆదరించి పోషించడం పుత్ర ధర్మం
7, తాను జన్మనిచ్చిన బిడ్డలను ప్రయోజకులను చేయడం తండ్రి ధర్మం
8, తన ఇంటికి, తనని కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం
9, తన వృత్తి ఎటువంటిదైనా తన వృత్తిని గౌరవించడం ధర్మం
10, తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం
11, అసహాయులను కాపాడడం మానవతా ధర్మం
12, చెప్పిన మాటను నిలుపుకోవడం సత్య ధర్మం
13, నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం మిత్రధర్మం
14, సోమరితనం లేకుండుట పురుష ధర్మం
15, ఉన్నంతలో పదిమందికి సహాయం చేయడం సేవాధర్మం
16, లోక సేవ మాధవ సేవే నీ ధర్మం