![]() |
TELUGU |
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
........ పల్లె సంతకం........
పల్లవి :-
చందమామల్లే తెలుగక్షరాలు గుండ్రం
దేశదేశాల్లొ మెరిసెలే మన ఆంధ్రం
అమ్మంటే అమృతం మామంటే మాధుర్యం
పలుకేమో సంగీతం నడకేమో నాట్యం "చందమామ"
చరణం 1.
తెలుగంటె పద్యమనుకొనుట మామూలు
శ్రమజీవుల అలుపు దీర్చులే జానపదాలు
చిరు సామెతలలో ఎన్నెన్నో భావచమత్కారాలు
అచ్చమైన తెలుగంటే తుదకు పల్లెలదేలే సంతకం "చందమామ"
2.
నన్నయాది కవులందరు కావ్యాలను రాయగా
కృష్ణరాయలవారు తెలుగును కీర్తించగా
గిడుగు వారు పిడుగై ధ్వజములెత్తగా
మాట్లాడే భాషాయెను రాజభాషగా "చందమామ"
3.
పుట్టింది మూల ద్రావిడమునుంచైనా
సంస్కృతాంగ్ల ఉర్దూ పార్శి పరదేశీ భాషలన్ని
పాలకుల స్నేహితుల బంధమై రాగా
సమభావన తో కలుపుకొని
సుసంపన్నమైనదాంధ్రం "చందమామ"
4.
ఆంధ్రా మాది తెలంగాణా మాది
కళింగాంధ్ర మాది రాయలసీమే మాది
ఎన్ని యాసలు ఉన్నా ఎవ్వరేమనుకున్నా
యాసే శ్వాసగా...మాటే పాటగా సాగుతాం "చందమామ"