-->

బారోమీటార్ లో వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయి?,Barometer and Atmosphere changes-How?

 
BAROMETER

బారోమీటర్ లోని పాదరసం మట్టం ద్వారా వాతావరణం లోని మార్పులు ఎలా తెలుస్తాయి ?.


బారోమీటర్ లోని పాదరసం మట్టం వాతావరణం లో ఉండే గాలి పీడనాన్ని తెలియజేస్తుంది . పాదరసం మట్టం పైకి పోయిందంటే గాలిపీడనం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం , ఆ మట్టం కిందకు పడిందంటే గాలి పీడనం తగ్గిందన్నమాట . బారోమీటర్ ని అంతరిక్షం లోకి తీసుకెళితే , ఆ శూన్య ప్రదేశం లో గాలి పీడనమనే ప్రశ్నే ఉండదు కాబట్టి ... పాదరసం మట్టం పూర్తిగా కిందికి పడిపోతుంది .


భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తికు వ్యాపించి ఉండే వాతావరణం లోని గాలి గురుత్వాకర్షణ వల్ల ఒత్తిడి (pressure) కలుగజేస్తుంది . భూమి పై వివిధ ప్రదేశాలలో గాలి పీడనం వేరువేరు గా ఉండడమే కాకుండా కాలం తో పాటు మారుతూ ఉంటుంది . చల్లని గాలి కన్నా వేడి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది . అంటే వేడి గాలి , చల్ల గాలి కన్నా తేలిగా ఉంటుంది . అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఎడారుల్లో గాలి పీడనం తక్కువగా ఉంటే , మంచు వలన చల్లగా ఉండే ధ్రువ ప్రాంతాల్లో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది .


వాతావరణం లోని గాలి పీడనం హెచ్చు తగ్గులను సూచించే బారోమీటర్ రీడింగులను బట్టి వాతావరణం లో కలుగాబోయే మార్పులను ముందుగానే తెలుసుకోవచ్చు . పీడనం ఎక్కువై బారోమీటర్ లోని పాదరసం మట్టం పైకి పోయిందంటే ఆ ప్రాంతం నిర్మలం గా ఉండబోతున్నట్లు . పీడనం తగ్గి పాదరసం మట్టం తటాలున పడిపోతే ఆ ప్రాంతం మేఘాలతో కూడిన వర్షాలు రాబోతాయని అర్ధం . మట్టం మరీ పడిపోతే తుఫాన్ లాంటి బీబత్సాలకు సూచిక .

4 Comments

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT