-->

మన ఇంటి 'ఆడ' కూతురు...

 

మన ఇంటి 'ఆడ' కూతురు...


ఓ చిన్న కధ .

చాలా బాగుంటుంది ...

తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన అధ్బత కధనం తప్పకుండా చదవండి..


అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు ఆరోజున..!!


అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది.

తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించారు.

పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. 


పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు,వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళలసివస్తుంది. 


అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరుని తరపువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. 


కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది.

శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.


అయితే మగపెళ్ళి వారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.


మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.


అందులో పంచదార లేదు సరికదా,

తనకిష్టమైన యాలకులపొడి వేశారు.


మాఇంటి పధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.


మధ్యాహ్నం భోజనం చేశారు,

అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.


వెంటనే ఏం బయలు దేరుతారు,

కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు.

అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది.

కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.


బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...

'నేను ఏం తింటాను,

ఎలా తాగుతాను,

నా ఆరోగ్యానికి ఏది మంచిది ...

ఇవన్నీ మీకెలాతెలుసు..?' అని.


అమ్మాయి అత్త గారు ఇలా అంది....

'నిన్నరాత్రి మీఅమ్మాయి ఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది.

మానాన్నగారు మొహమాట పడతారు.

వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది.'


శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.


శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...

'లలితా, మా అమ్మ చనిపోలేదు.'


'ఏమిటండీ మీరు మాటాడుతున్నది'


'అవును లలితా,

నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది..

నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు

నిండిన కళ్ళతో.


అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము,

మన ఇల్లు వదిలి పోతుందని.

తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది.

తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకొని.


*ఆడ పిల్లను బతకనిస్తే .....

అమ్మను గౌరవించినట్లే.....*


ఆడకూతుర్లు గురించి ఓ మంచి ఆర్టికల్ ఇదీ .


తన కన్న కూతురిని గౌరవించేవారు ప్రతి తండ్రి

ఇట్టి నా కధనాన్ని తప్పకుండా షేరు చేయ్యండి .

మీ తల్లి అత్మ ఎచ్చటున్న ఆనందిస్తుంది. 


           🙏సర్వ సృష్టి సఖినో భవత్🙏

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT