అందానికి వేప:
ఇప్పుడంటే మెరిసే చర్మం కోసం బోలెడన్ని సబ్బులు, రకరకాల క్రీములు.
కానీ, ఇవేం లేని రోజుల్లో వేపాకు, నూనెలు అందానికి ఔషధంగా పనిచేసేవి.
చర్మంపై చిన్న మచ్చపడ్డా, ముఖం కాస్త రంగు మారినా వేపనూనెతో
మర్దనా చేసేవాళ్లు ఇంతకుముందు. రకరకాల అలర్జీలకు, ఇన్ఫెక్షన్లకి
కూడా వేపాకుల్ని ఉపయోగించేవాళ్లు. ఇప్పటికీ సబ్బులు, ఫెయిర్నెస్
క్రీములు, సన్ స్క్రీన్ లోషన్స్ లాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో వేపని వాడుతున్నారు.
అందమైన, ఆరోగ్యమైన స్కిన్ కావాలనుకునే వాళ్లు వేప నూనెని, ఆకుల్ని
వాడాలి.
ఎమేలు చేసే ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్
-సి, ఈలు పుష్కలంగా ఉంటాయి. అలాగే బై
గ్లిజరైడ్స్, కెరోటినాయిడ్స్, లిమోనాయిడ్లు,
కాల్షియం, ఒలేయిక్ యాసిడ్, నింబిన్ లాంటి
విటమిన్లు కూడా అధికం. వేపనూనెతో చేసిన
ప్యాస్టు ముఖానికి వేసుకోవడం వల్ల ఈ
గుణాలన్నీ చర్మానికి అంది ముఖం అందంగా,
ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం వేపనూనె
కాదు వేపాకుల్లోనూ చర్మానికి మేలు చేసే చాలా
గుణాలుంటాయి.
డ్రై స్కిన్
కొంతమందికి కాలమేదైనా సరే స్కిన్ పొడిబా
రుతుంది. డల్ గా, నిర్జీవంగా తయారవుతుంది.
అలాంటప్పుడు మూడుచుక్కల వేపనూనెని
ముఖానికి రాసి మర్దనా చేయాలి. వేపనూనెలోని
విటమిన్- ఈ చర్మంలోకి తేలిగ్గా చొచ్చుకు
మాయిశ్చరైజ్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే వేపనూనెలో ముల్తానీ మట్టి, తేనె, నిమ్మర
సం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకో
కుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముడతలు తగ్గిస్తుంది
వేపనూనె చర్మంపై ముడతల్ని తగ్గించి యంగ్
లుక్ ఇస్తుంది. 30మిల్లీలీటర్ల వేపనూనెలో
200 మిల్లీలీటర్ల జొజోబా ఆయిల్, ఐదు చుక్కల
లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి. అమిశ్ర
మాన్ని రోజుకి రెండుమూడుసార్లు ముఖానికి
రాసి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే
వేపనూనెలోని కోరోటినాయిడ్స్, విటమిన్-ఈ,
ఒలేయిక్ యాసిడ్స్ చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తి
ని పెంచి చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచి
ముడతల్ని నివారిస్తాయి. అంతేకాదు చర్మానికి
మచ్చలు
కొత్త మెరుపుని, సాగే గుణాన్ని, మృదుత్వాన్ని
కూడా ఇస్తాయి.
యాక్నే సమస్యలకు వేపనూనె మంచి విరుగుడు.
వేపనూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు
ముఖంపై మొటిమలు, మచ్చలు, డార్క్
సర్కిల్స్ ని మటుమాయం చేస్తాయి. చర్మంపై
దద్దుర్లని కూడా తగ్గిస్తాయి. పావు టీ స్పూన్
వేపనూనెలో కొద్దిగా ముల్తానీ మట్టి వేసి
నీళ్ళు కలిపి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని
ముఖంపై మొటిమలు, మచ్చలున్న చోట రాసి
ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ
చేస్తేయాక్నే సమస్యలు దరిచేరవు. అలాగే
గుప్పెడు వేపాకుల్ని అరలీటరు నీళ్లలో వేసి
స్టవ్ పై పెట్టాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ
రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి
ఆ కషాయాన్ని సీసాలో పోయాలి. ప్రతిరోజూ
రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని
తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు,
మచ్చలు తగ్గుతాయి. ఆ కషాయాన్ని బకెట్
నీళ్లలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తే చర్మంపై
దద్దుర్లు పోతాయి. కొద్ది రోజుల్లోనే చర్మం
ఆరోగ్యంగా మారుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు
జిడ్డు చర్మంతో బాధపడేవాళ్లు వేపాకు, గంధం
పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా
తీసుకోవాలి. అందులో మూడు నాలుగు చుక్కల
వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం కూడా వేసి
పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి
పట్టించి, అరగంట సేపు ఆరనివ్వాలి. పూర్తిగా
ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం
చేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది.
NEEM, NEEM TREE, NEEM OIL