"ఎందుకంత కష్టం"
ఒసేయ్... బామ్మ... పెళ్లి పనులు మేము చూచుకుంటాం... నువ్వు అలా కూచొని మాకు డైరెక్ట్ చేయవే....
ఈ వయసులో నీకేదైనా అయితే మేము తట్టుకోలేం... ఈ శుభకార్యం అయ్యేంత వరకూ ఓపికగా వుండవే....
ఓరి భడవా !!! నా కళ్ళెదుట పుట్టి పెరిగి నన్నే కట్టడి చేస్తావ్... నీ తరం కాదురా...
ఆడించే చేయి...తిరిగే కాలుని అదుపు చేయలేమురా.... సరే వినుకో....
చేయడానికి ఏమీ లేకపోయినా... ఏమీ చేయకుండా ఉండటం చాలా కష్టం...
కారణం.....
మానవ శరీర అమరికలో వున్న మేజిక్....
అసంకల్పితంగా జరిగే జీవక్రియలు ... ఊపిరి ఉన్నంత వరకూ నా ప్రమేయం లేకుండా ఎవ్విధముగా వాటి విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తాయో...
ఆవ్విధముగా నా కాలు చేయి ఆడిస్తూ ఉండవలసిందే....
బ్రెయిన్ బోర్ బోర్ అంటే... బాడీ బడలిక వలదు ... చించు ఆలోచించు అన్నట్లు ... బాడీ అలసిపోతే తన ఇన్నోవేటివ్ థాట్స్ తో నూతనుత్తేజం కల్పించే బ్రెయిన్...
వీరువురి మధ్య మంచి అవగాహనతో కూడిన కోఆర్డినేషన్ వుంటే.....
ఎంతటి బద్దకస్తుడుకైనా... ఏ పనీ లేకుండా కూర్చోటం బహు కష్టం ...
ద ట్స్ వై ...మానవ జన్మ సో పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్....
ఒప్పుకుంటారా మీరు ???....