-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ....



 త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త .....😢😢🙏

_రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.

_అవును ఇది ఒక చేదు నిజం.!!

_ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.

_వాళ్ళు..

 _రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!
_ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!
_నడక అలవాటు ఉన్నవాళ్ళు.!
_మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!

_వాళ్ళు.....

 _ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
_ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
_మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
 _పూజకు పూలు కోసే వాళ్ళు !
_వాళ్ళు....

_పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
_మడిగా వంట వండేవాళ్ళు!
_దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
_దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు.!
_దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
_మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!

_వాళ్ళు

 _అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!
_కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!
_స్నేహంగా మెలిగే వాళ్ళు...!
_తోచిన సాయం చేసేవాళ్ళు..!
_చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!

_వాళ్ళు

_ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!
_ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు...!
_పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!
_ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు....!
 
_వాళ్ళు

_పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!
_కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!
_సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!
_పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!

_వాళ్ళు ...

_తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!
_ఆచారాలు పాటించే వాళ్ళు..!
_తిధి,వారం ,నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!
_పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!

_వాళ్ళు ....

_చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!
_లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు...!
_చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!
_అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!

   _మీ_
_వాళ్ళు ....

_తలకు నూనె రాసుకునే వాళ్ళు .!
_జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!
_కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు...!
_చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !

_ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

_ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

_మీకు తెలుసా ?

_వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

_మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.

_మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి

_లేదంటే .....

_లేదంటే ....

_లేదంటే ....

_ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

_వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం..

_సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!

 _స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !

_కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!

 _ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం

_ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!

_సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది.!

_లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !🙏

_ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊

 _తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం

_వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది🤔

_మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .🙏

_సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి...

_సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి.!!!
_తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!

_సర్కారు చేసే చట్టాలు కాదు..._🙏

_రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు.._🤔

అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి