ఈ భూమి భూమండలంలో ఎన్ని యుగాలో కదా మరి ?
దాదాపు 4.6 బిలియన్ల క్రితం ఈ భూమండలం ఏర్పడింది.మొదట్లో భూమి మండుతున్న అగ్నిగోళం. కాలక్రమంలో చల్లబడింది. భూమిమీద 600 మిలియన్ల సంవత్సరాల ప్రాణి ఏర్పడింది.
శాస్త్రవేత్తలు భూమి చరిత్రను అనేక యుగాలుగా విభజించారు. అవి
(1) క్రేంబియన్ పూర్వయుగం - 2500 - 590 మిలియన్ల సంవత్సరాలక్రితం. మొట్టమొదటి జీవం ఏర్పడింది ఈ యుగంలోనే.
గాలిలో అక్సిజన్ కూడా ఈ యుగంలోనే ఏర్పడింది.
(2) క్రేంబియన్ యుగం - 605 మిలియన్ల సంవత్సరాలక్రితం.సముద్రంలో నత్తగుల్ల వంటి ప్రాణులు ఏర్పడ్డాయి.
(3) అర్థోవిసియన్ యుగం - 590 మిలియన్ సంవత్సరాల క్రితం. సహారా ఎడారి మంచుఖండంగా వుండేది. చేపలు వంటి ప్రాణుల ఆవిర్భావం జరిగింది.
(4) సిలూరిన్ యుగం - 438 మి. సం॥ క్రితం. మొక్కల పుట్టుక ఈ యుగంలోనే జరిగింది. కోరలు కలిగిన చేపలు, మంచినీటి చేపల ఆవిర్భావం జరిగింది.
(5) డినోసియన్ యుగం - 408 మిలియన్ సంవత్సరాల క్రితం.కీటకాలు ఈ యుగంలో పుట్టాయి. ఉభయచర జీవులు పుట్టాయి. పొదలు, నాచుమొక్కలు, పెద్దపెద్ద వృక్షాలు పుట్టుక జరిగింది.
(6) కార్భోనిఫెరోస్ యుగం - 360 మిలియన్ల సంవత్సరాల క్రితం. అడవులు విస్తరించాయి. వేడిమడుగుల కారణంగా బొగ్గు ఏర్పడింది.
సరీసృపాలు ఈ యుగంలోనే ఏర్పడ్డాయి.
(7) పెర్మియన్ యుగం - 284 మిలియన్ల సంవత్సరాల క్రితం.
కోనిఫర్ అడవులుగా మొక్కల పరిణామం జరిగింది. ఏడారుల విస్తరణ మొదలైంది.
(8) జూరాసిక్ యుగం - 213 మిలియన్ సంవత్సరాల క్రితం. రాక్షసబల్లుల కాలం.పక్షులుగా అర్కియోపేర్టెక్స్ లు ఏర్పడ్డాయి. ఇవే మొదటి పక్షులు.
(9) ట్రెయాసిక్ యుగం - 144 మిలియన్ సంవత్సరాల క్రితం.క్షీరదాల పుట్టుక. ధాన్యపు గింజల ఏర్పాటు. ఉష్ణమండలాలనుండి ఐరోపాఖండం ఏర్పడింది.
(10) క్రీటేషియన్ యుగం - 100 మిలియన్ల సంవత్సరాల క్రితం. పూలు పూచే మొక్కల పుట్టుక. రాక్షసబల్లులు అంతరించపోయాయి.
(11) టెర్షియన్ యుగం - 65 మిలియన్ల సంవత్సరాల క్రితం. పెద్దపెద్ద క్షీరదాలు, పక్షులు అభివృద్ధి చెందాయి. గడ్డి భూముల విస్తరణ జరిగింది.
(12) క్వాటేనరీ యుగం - రెండు మిలియన్ల క్రితం.మానవుని ఆవిర్భావం జరిగింది.