-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

Living with Difficult people

 

Living with Difficult people....!!!


ఒకే ఇంట్లో ఉండే ‘ఎడమొహం’ వ్యక్తులతో కలసి ఉండాల్సి రావటం, 


ఉమ్మడి కుటుంబాల్లో సరయిన సంబంధాలు లేకపోవటం;


 ఆఫీసులో ‘నచ్చని’ అధికారులతో,


కానీ “కష్టసాధ్యమైన మనుష్యులతో” కలిసి ఉండటం కన్నా నరకం మరొకటి ఉండదు. 


Scott MautzKeynote అనే సోషియాలజిస్టు వేలమంది సంసారులు, ఉద్యోగులు, వర్కర్ల పై చేసిన సర్వేలో నూటికి ఎనభై మంది ఫీలయ్యే స్ట్రెస్ ఏమిటో తెలుసా?


 ఇంటర్-పెర్సనల్-రిలేషన్స్..!


 అజ్ఞాని అయిన అధికారి, బద్దకస్తుడైన తోటి ఉద్యోగి, ఎప్పుడూ సణుగుతూ ఉండే భార్య, నిరంతర కోపగ్రస్తుడైన భర్త, చాదస్త రోగ రూపిణి అత్తగారు, డామినేటింగ్ ఆడబడుచు... మన నవ్వునీ, జీవితం పట్ల ఉత్సాహాన్ని హరించివేస్తారు. కూడూగుడ్డ కోసమో, సామాజిక కట్టుబాట్ల పట్ల భయంతోనో, ఆర్ధిక స్వాతంత్రం లేకపోవటం వల్లనో వచ్చిన అబధ్రత... ఇష్టంలేని వ్యక్తులతో కలిసి మనం జీవించవలసి వచ్చేలా చేస్తుంది. చివరకు దుర్మార్గపు కొడుకుని వదులుకోలేని ‘రక్త సంబంధ ప్రేమ’ కూడా..! 


మరేం చెయ్యాలి? ఒకటే మార్గం. ...!!


అవతలి వారి undue influence నుంచి బయటకు రావాలి. చెప్పటం సులభమే. కానీ ఆచరణలో కష్టం. మరి... 


1. Building on COMMONALITIES: అవతలివారి ప్రవర్తనకి ‘కోపిష్టి, మంకుపట్టు, అశుభ్ర, బద్దకస్త, ఈగోయిస్టిక్’ లాంటి లేబుల్స్ అతికించకండి. ఏ వ్యక్తి కూడా మరీ అంత మానసిక అస్పృశ్యుడు కాదు. ఇద్దరికీ ఇష్టమైన విషయాలు కనీసo కొన్నైనా ఉంటాయి. వాటిని పెంచటానికి, ఆ సర్కిల్లో ఎక్కువ కాలం ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. చిన్న చిన్న కంప్లిమెంట్లు శత్రువునైనా సంతోషపడేలా చేస్తాయి. అప్పుడప్పుడూ అవతలివారిని మభ్యపెట్టవలసిన పరిస్థితి ‘లౌక్యం’ అంటారు. ఎదుటివ్యక్తిలో ఉన్న (మంచి + చెడు) క్వాలిటిస్ లో మీకు నచ్చని వాటి సర్కిల్స్ లోకి వీలైనంత వరకూ వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. మీకు సరిపడని వృత్తాలలోంచి బయట పడే అవకాశం ఏమైనా ఉన్నాదా? అని అన్వేషించండి.


2. Never play loose games: యుద్ధంలో శత్రువు అవతలి వ్యక్తి కాదు. మన అలవాట్లు. ఉదాహరణకి ‘నోరు జారే’ అలవాటు. అత్తగారి గురించి తోడికోడలు దగ్గర చేసిన కామెంట్ ఆమె పెద్దావిడకి చెప్పొచ్చు. తన ఈడుదే అవడంవల్ల మంచి స్నేహితురాలిలా కనపడిన ఆడపడుచుతో మొదట్లోనే మనసు విప్పి అన్నీ ఆమెకి చెప్పుకుంటే, ఏదో మనస్పర్థ వచ్చినప్పుడు ఆమె వెళ్ళి చెప్పకూడని విషయాలు తల్లికి చెప్తే... అగ్నిపర్వతం పేలిపోయే ప్రమాదం ఉంది. 


3.. Build small bridges: చిన్న చిన్న వంతెనలు కట్టటానికి ప్రయత్నించండి. అవతలివాళ్ళు కూల్చేస్తున్నారనొద్దు. అసలు మీరు కడుతున్నారా? అన్నది ప్రశ్న. ప్రయత్నించి ఓడిపోయానన్నది మీ సమాధానం అయితే... వాళ్ళతో వాదిoచకండి. వాదించి మీరు గెలవలేరు. వాళ్ళు తమ తప్పులని వప్పుకోరు. మీరు మీ బలహీనతల్ని వప్పుకుoటున్నారా? ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం. వాళ్లలో మనకి ఎన్ని లోట్లు కనపడుతున్నాయో, మనలో కూడా వారికి అన్ని కనపడతూ ఉంటాయి. మీరు కరెక్టా? అవతలివారా? అన్నది ఎవరూ తేల్చలేరు. ఒక మేధావి, ఒక మూర్ఖుడూ గంట సేపు వాదిoచుకుని, విడిపోయేటప్పుడు ఒకరి గురించి ఒకరు అనుకునే ఒకే మాట, “తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు- చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు”. ఇక్కడే ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. వారి మాట సాగుతోంది. వాళ్ళు బాగానే ఉన్నారు. మారాల్సిన అవసరం వాళ్లకి లేదు. కలసి ఉండాల్సిన అవసరం మీకుంది.