మనం చేసే పనిపట్ల, మన వృత్తిపట్ల అంకిత భావం ఉంటే పేదరికం అడ్డుకాదు.నేను పేదవాడిని,కాని నా దృక్పధం మాత్రం పేదరికం కాదు అనే చెప్పుకునే కన్నా మనం చేసేపనిలో శ్రద్ద, అంకితభావం, గౌరవం ఉంటే మనం సక్సెస్ అవొచ్చు.
ఈ మద్యకాలంలో ఏ రంగంలో చూసినా అంటే విధ్యారంగంలో సక్సెస్ అయిన పిల్లలుకావొచ్చు, సివిల్స్ లో కావచ్చు, క్రీడారంగంలో కావచ్చు ఇలా చెపుతూ పోతే చాలా రంగాల్లో పేద, మద్యతరగతి పిల్లలు మరియు చిన్నచిన్న గ్రామాలు, పట్టణాలనుండి వచ్చినవారే ఎక్కువగా అధ్బుతంగా రాణిస్తున్నారు. మనకు కావలసింది లక్ష్యం, దాన్ని సాధించాలన్న తపన, కసి అవి ఉంటే మిగతావి ఏవీ అడ్డుకావు. మన నిజజీవితంలో తారసపడే ఎంతోమంది హైద్రాబాద్ యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్ , తమిళనాడుకు చెందిన నటరాజన్ తల్లి చికెన్ సెంటర్ , ముంబైకి చెందిన జైస్వాల్ తండ్రి పానీపూరీవాలా ఇలా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులున్నా మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారు., సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నారు. వీరందరూ నాకైతేఆదర్శప్రాయం.
మన పిల్లలకుకూడా ఇలాంటి వారిగురించి తెలియచేయాలి, మోటివేట్ చేయాలి. వృత్తి ఏదైనా పోరాటం, పోటీతత్వం అన్నింటా సమానమే కావలసింది పాజిటివ్ ధృక్పదం.
ఆలాంటి వాళ్లు మాటలకే పరిమితం
చేతల్లో రాణించలేరు