నాయకుడి లక్షణాలు:
1) మార్గదర్శి గా ఉండాలి.
2) ప్రజల వద్దకు పాలన చేయాలి.
3) తగిన వ్యక్తి ని తగిన పనిలో నియమించాలి.
4) తనలోని లోపాలను సరిదిద్దుకోవాలి.
5) అధికంగా పొగిడేవారిని దూరంగా పెట్టాలి.
6) సభ్యులకు సమస్యలతోనే కాదు, సమస్యలతో పాటు పరిష్కారాలతో రమ్మని చెప్పాలి.
7) ఎదుగుతున్నకొద్దీ ఒదిగి ఉండాలి.
8) పనిచేసే వారిని పాడుచేసే వారిని దూరంగా పెట్టాలి.
9) వ్యక్తుల/ సభ్యుల పేర్లు గుర్తుంచుకోవాలి.
10) ఫిర్యాదు అందినప్పుడు నిజానిజాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
11) ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవాలి.
12) ప్రత్యర్థుల కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
13) "నాకు అన్నీ తెలుసు" అనే ధోరణిలో ఉండరాదు.
14) గతంలో సాధించిన విజయాలు రేపటికి పనికివస్తాయని అనుకోవద్దు.
15) ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.